హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. ఘన స్వాగతం

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా, బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు.

రేపు ఉదయం 10.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం చెన్నై వెళ్లి డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శిస్తారు.
Go Back to Shorts
President Of India
Ram Nath Kovind
hyderabad

More Telugu News